దిల్లీ లో మందు బాబులకు కిక్కేచ్చే వార్త

Kicking news for Liquor Drinkers in Delhi

0
132

దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మందు బాబులకు మంచి కిక్కెక్కించే నిర్ణయం అంటున్నారు అందరూ. 2021-22 ఎక్సైజ్ పాలసీలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకునే ఉంటాయి. అంతేకాదు ఇప్పటి వరకూ మందు తాగే వారి కనీస వయసును 25 ఉంది, ఇకపై 21 ఏళ్లకు తగ్గించింది.

అంతేకాదు ఈ కొత్త ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వ రీటెయిల్ వైన్ షాపులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ షాపులను ప్రమోట్ చేస్తూ పాలసీని తయారు చేశారు. అంతేకాదు ఇక వైన్ షాపుల్లో పూర్తి ఎయిర్ కండిషనర్లు ఉంటాయి.

ఇవన్నీ గ్లాస్ డోర్లతో ఉంటాయి. లిక్కర్ కొనుగోలుదారులు షాపుల ఎదుట బారులు తీరకుండా వారు నచ్చినది బ్రాండ్ తీసుకోవచ్చు.హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు ఇవి ఉంటాయి.