మధు యాష్కీ అలగ్ సలగ్.. రాహుల్ గాంధీతో భేటీ

0
33

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం చేసింది పార్టీ అధిష్టానం. కొమ్ములు తిరిగిన సీనియర్లను కాదని, వారిని పక్కనపెట్టి పార్టీలో తారాజువ్వలా మెరిసిన రేవంత్ రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. రేవంత్ టీమ్ లో క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ గా మధుయాష్కీని నియమించింది. కొత్త కమిటీని ప్రకటించిన తర్వాత మధుయాష్కీ ఇప్పటి వరకు పెద్దగా తెర ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి, మధు యాష్కీ అసలు ఒకరి మొహం ఒకరు చూసుకోనేలేదు. ప్రమాణ స్వీకారం నాటి వరకు మధు యాష్కీ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రమాణ స్వీకారం తేదీ అయిన జులై 7న నేరుగా ఆయన ఢిల్లీనుంచి విమానంలో దిగారు.

ఒకవైపు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ప్రకటన రాగానే పార్టీ సీనియర్లను వరుసబెట్టి కలుస్తూ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తనను కలవొద్దు అని హెచ్చరించారు. దీంతో ఆయనను తప్ప మిగిలిన పెద్దలందరినీ రేవంత్ రెడ్డి కలిశారు. అంతేకాదు తన టీమ్ సభ్యులను సైతం వెంటపెట్టుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ వారి ఆశిస్సులు తీసుకున్నారు. కానీ మధు యాష్కీ మాత్రం ఇంకా ఎవరినీ కలుసుకోలేదు. కేడర్ కు కూడా అందుబాటులోకి రాలేదు. ఇవాళ ప్రమాణ స్వీకారం ముగిసన తర్వాత మధు యాష్కీ తన యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ఎక్కడా బయటపడకపోవడం గమనార్హం.

రాహుల్ గాంధీతో మధు యాష్కీ భేటీ

బుధవారం టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. తాజా తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మధుయాష్కీ గౌడ్ కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తను కలవాలని రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లాలని మధుయాష్కీకి రాహుల్ గాంధీ హితబోధ చేసినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ ఆశీస్సులు తీసుకుని ప్రచార కమిటీ బాధ్యతలు స్వీకరణకు ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు మధుయాష్కీ గౌడ్.

మధు యాష్కీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మణికం ఠాకూర్ కూడా ఉన్నారు. మధు యాష్కీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గన్ పార్కు అమర వీరుల స్థూపం వరకు వచ్చి అక్కడ నివాళులు అర్పించి గాంధీభవన్ చేరుకుని ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటరాని పార్టీ నేతలు తెలిపారు.

ఎయిర్ పోర్టులో మధు యాష్కీకి స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, మణికం ఠాగూర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్న మధు యాష్కీ గౌడ్ వీడియో లింక్ కింద ఉంది.

https://www.facebook.com/alltimereport/videos/179239490867150