ఆమె కట్టుకున్న భర్తను వదిలిపెట్టింది. వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. పైగా తనకు, తన ప్రియుడికి తన కుటుంబసభ్యుల నుంచి రక్షణ కావాలంటూ కోర్టుకెక్కింది. ఆమె వాదనను కోర్టు తోసిపుచ్చుతూ ఆమెకే ఉల్టా 5000 రూపాయల ఫైన్ వేసింది. ఈ ఘటనకు సంబంధింన మరిన్ని వివరాలు…
భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఒక యువతి తన కుటుంబసభ్యులు తమ మీద దాడి చేయకుండా వారి నుంచి హాని కలగకుండా రక్షణ కల్పించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు కౌషల్ జయేంద్ర థాకర్, దినేష్ పాథక్ కేసును కొట్టివేశారు. ఈ సందర్భంగా వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం హిందూ వివాహ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం అని వారు పేర్కొన్నారు.
వారి పిటిషన్ కొట్టివేస్తూ ఉల్టా ఆమెకు, ఆమె ప్రియుడికి 5000 రూపాయల ఫైన్ కూడా వధిస్తూ తీర్పు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒఖ్కరికీ స్వేచ్ఛ ఉందని, జీవించే హక్కు అందరికీ ఉందని చెబుతూనే కానీ చట్టాలకు లోబడి ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంలో చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్ ను ఎలా అంగీకరించగమని ధర్మాసనం ప్రశ్నించింది.
భర్త నుంచి కానీ, కుటుంబసభ్యుల నుంచి కానీ ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే నేరుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని సూచించింది. కానీ ఈ కేసులో నేరుగా కోర్టుకు ఎలా వచ్చారని ఆక్షేపించింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో చట్యవ్యతిరేక కార్యకలాపాలను అనుమతించలేమని కోర్టు తెలిపింది.