Flash: కాబోయే భర్త మోసగాడని తెలిసి అరెస్ట్ చేసిన లేడీ పోలీస్..

0
78

అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఓ లేడీ పోలీస్ చేసిన పనికి అందరు సెల్యూట్ కొడుతున్నారు. కాబోయే భర్తని మహిళ పోలీస్‌ అరెస్ట్ చేయించి నిజాయితీకి నిలువెత్తు రూపంగా మారింది. అసోంలోని నాగావ్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఎస్‌ఐ జున్మోని రాభా అనే మహిళ పోలీస్‌కు రానా పోగాగ్‌ అనే వ్యక్తి ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐకి పరిచయం అయ్యాడు.

అయితే మొదట్లో అతడు మంచివాడే అనుకోని ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు. కానీ ఆ తర్వాత అతడు ఓ మోసగాడని, ప్రజల నుంచి రూ. కోట్లు దోచుకున్నాడని తెలిసి ఏ మాత్రం ఆలోచించకుండా కేసు నమోదు చేసి అస్సాం పోలీసులు సమాచారం తెలియజేయడంతో పోలీసులు రానా పోగాగ్‌ను గురువారం అరెస్ట్‌ చేశారు.

వీరిద్దరి పెళ్లి నవంబర్​లో జరగాల్సి ఉండగా..పోలీసులకు పట్టించి  న్యాయాన్ని గెలిపించడంతో అందరు ఈమెను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహిళ చేసిన పనికి అస్సాంలోని ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పోలీసులు ఉన్నంత వరకు దేశంలో అన్యాయానికి చోటుండదని అందరు పొగడ సాగారు.