తెలంగాణాలో న్యాయవాదుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ములుగులో న్యాయవాది మల్లారెడ్డి హత్య మరవకముందే మరో న్యాయవాది హత్య జరిగింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్యతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని యల్లమ్మ గూడెం గ్రామ సర్పంచి భర్త విజయ రెడ్డిని దుండగులు చంపేసి గ్రామ సమీపంలోని కాలువ వద్ద మృత దేహాన్ని పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.