లోన్‌యాప్ వేధింపులు-వ్యక్తి సూసైడ్..భార్య అశ్లీల ఫోటోలు పోర్న్ యాప్ లో ..

0
110

ఆన్ లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న ఈ యాప్ తాజాగా మరొకరిని బలి తీసుకుంది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ శాస్త్రీపురంకు చెందిన ఫైర్ మెన్ సుధాకర్ రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు.

లోన్ ఏజెంట్లు సుధాకర్ భార్య అశ్లీల ఫోటోలు పోర్న్ యాప్ లో పెట్టమని అవమానించారు. సుధాకర్ బందువులు, స్నేహితులకు అసభ్యకరంగా మెస్సేజ్ లు పంపారు గోల్డెన్ రూపీ లోన్ యాప్ ఏంజట్లు. వారి వేధింపులు తట్టులేక సూసైడ్ చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే లోన్ ఏజెంట్ల వేధింపులు తాళలేక హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో రెండు రోజుల్లో రుణయాప్‌ల బాధితుల్లో తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. వేర్వేరు ఠాణాల్లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేశారు.