పెళ్లి మండపంలో షాక్ ఇచ్చిన లవర్

0
133

ఖమ్మం బైపాస్‌ రోడ్డులోని కృష్ణా ఫంక్షన్‌ హాలులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కల్యాణ మండపం వద్ద రజిని అనే యువతీ ఆందోళనకు దిగింది. మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్‌ అనే వ్యక్తి తనను ఎనిమిదేళ్లుగా ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మరొకరితో  రహస్యంగా వివాహం చేకుంటున్నాడని ఆరోపించింది. తనను ప్రేమించి అన్యాయంగా ఎలా మోసం చేస్తాడని ఆరోపిస్తూ రజిని పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది.

ఫంక్షన్‌ హాలులో యువతీ పెళ్ళి ఎందుకు చేసుకోవని యువకుడిని నిలదీయడంతో.. పెళ్లి కుమారుడి బంధువులు యువతిపై దాడికి దిగారు. ఆమెను ఫంక్షన్‌ హాలు నుంచి బలవంతంగా జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లారని బాధిత యువతీ కన్నీరు మున్నీరు చేసుకుంది. అనంతరం యువతి మీడియాతో మాట్లాడుతూ తనను మోసం చేసి రహస్యంగా వేరే పెళ్లి చేసుకుంటున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని బాధపడింది.