Flash- తెలంగాణలో ఘోరం..కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి

Man brutally murdered with family quarrels

0
101

తెలంగాణ: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కుమ్మరి రవి అనే వ్యక్తిపై సోదరుడు శ్రీనివాస్‌, తండ్రి లక్ష్మయ్య కలిసి రోకలిబండతో దాడి చేశారు. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గత సంవత్సరం క్రితం పిట్లం చెరువులో తన కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుందని పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. అప్పటి నుంచి మృతుడు రవి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవారని పేర్కొన్నారు. మృతుడి అన్న శ్రీనివాస్, తండ్రి లక్ష్మయ్య పరారీలో ఉన్నట్టు పట్టణ సీఐ తెలిపారు.