Karnataka | తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడి గొంతు కోసి అతడి రక్తం తాగిన ఘటన కలకలం రేపింది. కర్ణాటక(Karnataka)లోని చిక్కబళ్లాపూర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విజయ్, మారేష్‌లు ఇద్దరు స్నేహితులు. అయితే మారేష్ తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని విజయ్ అనుమానించాడు. ఈ క్రమంలో తనను కలవాలని మారేష్ ను విజయ్ కోరాడు. ఇద్దరు ఓ చోట కలుసుకుని మాట్లాడుతున్న క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోతున్న విజయ్ తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మారేష్ గొంతుపై దాడి చేశాడు. అనంతరం మారేష్ గొంతు నుండి కారుతున్న రక్తాన్ని తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విజయ్ ను అరెస్ట్ చేశారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also:
1. ఒడిశాలో ఘోర ప్రమాదం.. పది మంది దుర్మరణం
2. కాసేపట్లో ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat