మాట్లాడట్లేదని 51 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి పొడిచి దారుణంగా..!!

-

దేశంలో ఏదొక చోట ప్రేమ పేరుతో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించట్లేదనో, అనుమానంతోనే, పెళ్లి చేసుకోమని అడిగిందనో అమ్మాయిలను అతి కిరాతంగా చంపిన ఉదంతాలను ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. టెక్నాలజీతో పోటీ పడి దూసుకెళ్తున్నప్పటికీ, మానవ సంబంధాల్లో మాత్రం పరిపక్వత మరిచి ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. శ్రద్ధా వాకర్ ఘటన మరువకముందే ఛత్తీస్ ఘడ్ లో మరో దారుణ ఘటన జరిగింది. మాట్లాడట్లేదని 20 ఏళ్ళ యువతిని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే..

- Advertisement -

తనతో మాట్లాడేందుకు నిరాకరించిందని 20 ఏళ్ల యువతని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చారు. 51 సార్లు స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఈ నెల 24న సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లోని పంప్ హౌజ్ కాలనీలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంట్లో యువతి ఒంటిరిగా ఉన్న సమయంలో వెళ్లిన వ్యక్తి, నోటిని దిండుతో అదిమి పట్టి దాడికి పాల్పడ్డాడు. దాదాపు 51 సార్లు స్క్రూడ్రైవర్ తో ఆమెను పొడిచినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె సోదరుడు వచ్చే సరికి యువతి రక్తం మడుగులో ఉండటం గమనించి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. విచారణలో యువతికి మూడేళ్ల క్రితం నిందితుడితో పరిచయం ఉన్నట్లు తేలింది. అయితే ఆ తర్వాత అతను గుజరాత్ వెళ్లగా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో యువతి కొన్ని రోజులకు మాట్లాడటం మానేసింది. దీంతో ఆ వ్యక్తి యువతితో పాటు తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేశాడు. తాజాగా ఎవ్వరూ లేని సమయం చూసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...