దారుణం..7 నెలల గర్భిణీని చంపిన ఉన్మాది

0
109

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో దారుణం జరిగింది. అప్పన్నపాలెంలో ఓ ఉన్మాది ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వివరాల్లోకి వెళితే..అప్పన్నపాలెంకు చెందిన దూసర నాగరత్నంకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. కాగా, సోమవారం వారి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌ ఉండటంతో భర్త, కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో నాగరత్నం మాత్రమే ఇంట్లో ఉండగా.. అదే అదునుగా పిల్లి రాజు అనే వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు.

కాగా, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని  తెలుస్తోంది. మరోవైపు పిల్లిరాజుకు కూడా వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నాడు. హత్య సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, పిల్లి రాజుపై అంతకుముందు కూడా పలు నేరాలపై పోలీసు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.