Breaking News- ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టుల దుశ్చర్య

Maoist atrocities in Chhattisgarh

0
140

ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లా టెటం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్న ఉమేశ్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఉమేశ్‌ను మావోయిస్టులు చంపినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌‌ బోర్డర్‌‌లో అధిక సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్‌‌ అయ్యింది. మావోయిస్టుల అణచివేతకు బీఎస్‌‌ఎఫ్‌ను రంగంలోకి దించింది. సీఆర్‌‌పీఎఫ్‌‌తోపాటు బీఎస్ఎఫ్‌‌ బలగాలు సైతం అడవులను జల్లెడ పట్టడానికి రెడీ అవుతున్నాయి.