తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నర్సయ్య (42) అనే వ్యక్తిని కిషన్ అనే మరో వ్యక్తి ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసారని బంధువులు ఆరోపించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది.