వరంగల్ లో వర్మ ‘కొండా’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్..చీఫ్ గెస్ట్ ఎవరంటే?

0
101

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కొండా’. కొండా మురళి, సురేఖ జీవిత కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈనెల 23 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 18న వరంగల్ లో జరగనుంది. ఖుష్ మహల్ గ్రౌండ్లో 18న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.ఈ ఈవెంట్ కు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆర్జివి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్న తన మిత్రుడు, తెలంగాణ సింహం రేవంత్ రెడ్డికి ‘కొండా’ సినిమా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పారు.

https://twitter.com/RGVzoomin?