మొబైల్ యూజర్లు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ – జర జాగ్రత్త

0
56

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది, ఇదే అదునుగా చేసుకుని కొందరు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు, సులువుగా కాల్స్ మెసేజ్ లు ఓటీపీలు కొత్త లింక్స్ పంపి బురిడీ కొట్టించి బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు.

ఇలాగే ఓ ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ కంపెనీ  కస్టమర్ ని ఓ సైబర్ కేటుగాడు ఇలా మోసం చేశాడు…ఏకంగా 3.94 లక్షలు దోచేశాడు.

హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి లో వ్యక్తికి, ఓ ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ కంపెనీ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్ వచ్చింది…

వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే రీచార్జ్ ట్యూబ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు ఆ వ్యక్తి, కస్టమర్ ఈ మాటలు నమ్మాడు, ఆ యాప్ డౌన్ లోన్ చేసుకున్నాడు.

రూ. 10తో మొబైల్ నెంబర్ కు రీచార్జ్ చేయాలని  చెప్పాడు. ఇలా చేసిన వెంటనే అతనికి ఓ మెసేజ్ వచ్చింది అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 3.94 లక్షలు వేరే అకౌంట్ కు ట్రాన్సఫర్ అయ్యాయి, దీంతో వెంటనే అతను పోలీసులని అప్రోచ్  అయ్యాడు. చూశారుగా ఎవరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ పిన్ సీవీవీ కార్డ్ నెంబర్ అడిగితే అస్సలు ఇవ్వద్దు.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారు ఈ కేటుగాళ్లు.