కామారెడ్డి ప్రమాదంపై మోడీ ద్రిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం

0
100

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అసన్‌పల్లి గేట్ సమీపంలో ఆదివారం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా టాటాఏస్‌ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు..పలువురికి గాయాలయ్యాయి.

అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ మృతి చెందిన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాంతో పాటు ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని సోమవారం ఉదయం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

ఈ మేరకు వారికీ ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో..బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు అందజేయాలని నిశ్యయించుకున్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున సహాయం చేసి ఆదుకోవడానికి ముందడుగు వేసారు. ఈ విషయాన్నీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.