విషాదం..గోడ కూలి తల్లీకూతురు దుర్మరణం

0
117

తెలంగాణలో విషాదం నెలకొంది. నల్గొండ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తల్లీ కూతురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21) శ్రీకాకుళం నుంచి వలస వచ్చి పద్మానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు కొన్నేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఎప్పటిలాగే రాత్రి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. రాత్రి నుండి పడుతున్న వర్షానికి గోడలు నాని కూలాయి. ఈ సమయంలో గోడ పక్కనే ఉన్న బీరువా ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పడింది. దీనితో తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.