నేటి కాలం యువత చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తాజాగా తెలంగాణాలో ఇలాంటి ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మేఘమాల అనే యువతి తరచూ మొబైల్ ఫోన్ ను చూస్తుందని తల్లి మందలించింది. దీనితో మనస్థాపానికి గురైన యువతి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది.