బ్రష్‌ చేయకుండా వాటర్‌ తాగితే బోలెడు లాభాలు..

0
34
Drinking water

మనలో చాలామందికి బ్రష్‌ చేయకుండా వాటర్‌ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ విషయంలో చాలామందికి అనేక సందేహాలుంటాయి. బ్రష్‌ చేయకుండా వాటర్‌ తాగేస్తే ఆ బాక్టీరియా అంతా లోపలికి వెళ్తుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ  బ్రష్ చేయకపోయినా రోజూ ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అవేంటంటే..రోజు మొత్తానికి సరిపడ నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు ఒక్కటే  హైడ్రేట్‌గా ఉంచి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుతుంది. బ్రష్‌ చేయకుండా వాటర్‌ తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇంకా సెలైవాను ఉత్పత్తి చేసి నోరు పొడిబారిపోకుండా రీహైడ్రేట్ అయ్యేందుకు కూడా సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు చెడు శ్వాసను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయినప్పుడు నోటిలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ బ్యాక్టీరియాను మనం మింగడం ద్వారా ఇమ్యూనిటీ పెరిగి  జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అందుకే బ్రష్‌ చేయకుండా వాటర్‌ తాగే అలవాటు ఉన్నవారు నిస్సందేహంగా తాగవచ్చని చెబుతున్నారు.