ఫ్లాష్- గోదావ‌రి న‌దిలో దూకి న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య

New bride commits suicide by jumping into Godavari river

0
81

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే న‌వ వ‌ధువు తనువు చాలించింది. బ్రతకడం కష్టమనుకుందో, లేక కష్టాల కడలి ఈదలేకపోయిందో తెలీదు కానీ 20 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. ఈ నెల 20న ఆమెకు వివాహం జరిగింది. అయితే ఆ మహిళను అత్త వారి ఇంటికి తీసుకెళ్ల‌డానికి త‌ల్లిదండ్రులు సిద్ధం అవుతుండ‌గా గోదావ‌రి న‌దిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కారణాలు తెలియాల్సి ఉంది. తల్లిఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.