యూపీలో ఐదో విడత పోలింగ్..కాంగ్రెస్ కంచుకోటలో ఓటింగ్

Fifth installment of polling in UP..Congress voting in Kanchukota

0
36

యూపీలో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇది 5 విడత పోలింగ్. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

దాదాపుగా 2.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుల్తాన్ పుర్, చిత్రకూట్, ప్రతాప్ గఢ్, కౌశాంబి, ప్రయాగ్ రాజ్, బారాబంకి, బహ్రయిచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేథి, రాయ్ బరేలీ, అయోధ్యలో కూడా పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 10న ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఈ విడత బరిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్​​ నేత పల్లవి పటేల్​ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సిద్ధార్థ నాథ్​ సింగ్ ​(అలహాబాద్​ పశ్చిమం), రాజేంద్ర సింగ్​(ప్రతాప్​గఢ్​), నంద గోపాల్​ గుప్తా నాడి (అలహాబాద్​ దక్షిణం), రమాపతి శాస్త్రి (మంకాపుర్​), 1993 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న రఘురాజ్​ ప్రతాప్​ సింగ్​ మరోమారు కుండా నుంచి పోటీలో నిలిచారు.