హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..తెరపైకి మరో 15 మంది వ్యాపారవేత్తలు

New twist in the Hyderabad drugs case

0
112

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్టు కూడా చేశారు. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర, విపుల్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాదులో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్. టోనీ దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. అలాగే హైదరాబాదులో 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఆ 15 మంది వ్యాపారవేత్తలు రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.