దారుణం..లిఫ్ట్ లో బాలికపై వృద్ధుడు లైంగిక వేధింపులు

0
110

దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుల అఘాయిత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. ఇక తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల చిన్నారి పాఠశాల నుండి ఇంటికి బయలుదేరింది. 11వ అంతస్తులోని తన ఇంటికి లిఫ్ట్ లో బయలుదేరింది. అదే సమయంలో లిఫ్ట్ లో ఉన్న 62 ఏళ్ల వృద్ధుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.