బిగ్ అలెర్ట్..ఆ రైళ్ల రద్దు..ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

0
36

మన దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఎంచుకుంటుంది రైలు మార్గం. రోడ్డు మార్గం, వాయుమార్గం, జల మార్గం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు రైలు మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల రైళ్ల రాక ఆలస్యం కాగా..మరికొన్ని రైళ్లు రద్దవుతాయి. ఈ విషయం తెలియని ప్రయాణికులు స్టేషన్ వచ్చి గంటల కొద్దీ వెయిట్ చేస్తుంటారు. అయితే రైల్వే శాఖ ఎప్పటికప్పుడు రైళ్ల వివరాలను తెలియపరుస్తుంది. ఇక తాజాగా ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే  అలెర్ట్ చేసింది.

వివిధ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ విధానం అమలులో ఉంటుందని తెలిపింది. ఈ మార్పును ప్రయాణీకులు గమనించాలని, ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది.

విజయవాడ – గూడూరు మధ్య నడిచే 07500

గూడూరు – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 07458
సికింద్రాబాద్ – మధిర 17202

మధిర – సికింద్రాబాద్ 17201 రైళ్లను 11, 12 తేదీల్లో రద్దు చేశారు.

కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం మధ్య నడిచే 17267 రైలు 10, 11 తేదీల్లో..

విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ మధ్య రాకపోకలు సాగించే 17268 రైలు 10, 11 తేదీల్లో

17258 కాకినాడ పోర్ట్ – విజయవాడ రైలు 10, 11 తేదీల్లో

విజయవాడ – కాకినాడ పోర్ట్ 17257 రైలు కూడా 10, 11 తేదీల్లో రద్దైంది.

07628 విజయవాడ – గుంటూరు రైలు, గుంటూరు – రేపల్లె 07786 రైలు, రేపల్లె – తెనాలి 07873, తెనాలి – గుంటూరు 07282, గుంటూరు – విజయవాడ 07864, విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465 రైళ్లు కూడా 10, 11 తేదీల్లో రద్దయ్యాయి.

గమనిక: ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.