ఒకటి..రెండు కాదు..ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంది..బాధితుల్లో పోలీస్ కూడా..

0
114

ఆమెది సాధారణ కుటుంబం. టీ కొట్టుతో వారి కుటుంబం నడుస్తుంది. కానీ ఆమెకు ఇదంతా నచ్చలేదు. రిచ్ లైఫ్ కావాలని ఆశ పడుతూ బతికేది. కానీ తలిదండ్రులకు ఆమె ప్రవర్తన నచ్చలేదు. సరిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇది నచ్చని ఆ మహిళ సౌమ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఓ హాస్టల్ లో ఉంటుంది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసుకున్నారు. రాజేష్ పోలీసుగా డ్యూటీ చేస్తున్నాడు. దీనిని ఆసరాగా చేసుకున్న సౌమ్య ఇతరులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసింది. చివరకు భర్త దగ్గర వున్న డబ్బులు తీసుకొని ఉడాయించింది. దీనితో రాజేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా కొద్దిరోజులకు ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. ఆపై మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇలా ఒకరి తరువాత ఒకరుగా మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకుంది. ఇక ఆరో పెళ్లి ఓ ఆటో డ్రైవర్ తో జరగబోతుందనే విషయం తెలుసుకున్న బాధితులు పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటన తమిళనాడులోని కరూర్ పట్టణంలో జరిగింది.