విమోచన దినోత్సవం నిర్వహించడానికి అన్ని పార్టీలు భయపడ్డాయి: అమిత్ షా

0
34

నిజాం అరాచక పాలన నుండి విముక్తి లభించి 75 ఏళ్లు అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించే సాహసం చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీ ఈ వేడుకలను నిర్వహించాలని ప్రకటించిన తర్వాతే మిగతా పార్టీలకు మెలుకువ వచ్చిందన్నారు. నేడు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ రాష్ట్రానికి సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చింది. నిజాం, రజాకార్ల పాలన నుండి సర్ధార్ పటేల్ ఆపరేషన్ పోలో వల్ల విముక్తి లభించింది. దేశమంతా స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరానికి హైదరాబాద్ కు స్వాతంత్య్రం వచ్చింది. నిజాం పాలనలో హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు. రజాకార్లు గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. అలాగే జలియన్ వాలా భాగ్ తరహా ఘటన కూడా గుండ్రంపల్లిలో జరిగింది.

ఈ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్ణాటక రవాణా శాఖా మంత్రి శ్రీరాములు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.