తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాస్క్ ధరించని వారిపై కొరడా ఝులిపించారు పోలీసులు. ఒక్కరోజే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్ని కూడా ఒక్క చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నమోదు కావడం గమనార్హం.
ముఖ్యంగా జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ లు ధరించని వారిపై పోలీసులు కేసులు పెట్టారు. పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్ల్స్ తదితర కౌంటర్ల లో వుండి మాస్క్ లు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఇకపై ఈ డ్రైవ్ ప్రతిరోజు కొనసాగానున్నట్టు పోలీసులు వెల్లడించారు.
దుకాణాల యాజమాన్యాలు, వాటిలో పని చేసే ఉద్యోగులు తప్పకుండా మాస్క్ లుధరిస్తూ ,covid నిబంధనలు పాటించాలి. కస్టమర్స్ ని సోషల్ డిస్టెన్స్ లో ఉండే విధంగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఎంట్రీ వద్ద శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలి. No mask No entry board లు కనిపించే విధంగా ఎంట్రీ వద్ద పెట్టాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.