పంద్రాగస్ట్..భారీ విధ్వంసానికి కుట్ర..2 వేల తూటాలు స్వాధీనం

0
94

పంద్రాగస్ట్ వేడుకల సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున తూటాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 2వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు