ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు..నెలకు వేతనం ఎంతంటే?

0
106

ప్రస్తుతం మన రెండు తెలుగురాష్ట్రాల్లో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నారు. అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికెషన్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పూర్తి వివరాలివే..

భర్తీ చేయనున్న ఖాళీలు: 30

ఖాళీల వివరాలు:

ఐసీటీసీ కౌన్సెలర్ పోస్టులు: 1

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 14

మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 4

డేటా మేనేజర్‌ పోస్టులు: 1

స్టాఫ్ నర్సులు పోస్టులు: 8

ఫార్మాసిస్ట్ పోస్టులు: 2

పోస్టుల వివరాలు: ఐసీటీసీ కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

విద్యార్హతలు: ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 యేళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

వేతనం: ఎంపకైనవారికి నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు: ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా ఆగస్టు 24, 2022 తేదీలోపు దరఖాస్తులను పంపవచ్చు.