Flash: పాలిటెక్నిక్ పేప‌ర్ లీక్..న‌లుగురి అరెస్టు

0
97

పాలిటెక్నిక్ పేప‌ర్ లీక్ ఘ‌ట‌న తెలంగాణలో సంచ‌ల‌నం రేపింది. ఈ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. కాగ ఈ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో తాజాగా రాచ‌కొండ పోలీసులు న‌లుగురిని అరెస్టు చేశారు. అనంత‌రం రిమాండ్ కు త‌ర‌లించారు. అయితే ఈ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో క‌ళాశాల యంత్రంగమే ఉంద‌ని పోలీసులు తెల్చారు. త‌మ కళాశాలలో ఉత్తిర్ణ‌త శాతం పెర‌గాల‌ని.. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను లీక్ చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో గ‌ల స్వాతి పాలిటెక్నిక్ క‌ళాశాలలో ఈ నెల 8, 9 తేదీల‌లో పేప‌ర్ లీక్ అయిన విషయం తెలిసిందే.