ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీపై స్పందించిన పవన్ కల్యాణ్

0
91

ఏపీ డిజిపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీపీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డిజిపీ బదిలీపై జనసేన అధినేత స్పందించారు. గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారు. ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించింది.

అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో?  ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలి. లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది.

ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి భయపెట్టి..అదుపు చేసేందుకు సవాంగ్ గారి బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం గని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుంది.