నల్గొండలో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్

0
115

నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టి యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో మెడ, కడుపుభాగం, ముఖం, కాళ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల‌పాలైన బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.

దాడి చేసిన యువ‌కుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించగా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. నిందితుడు మీసాల రోహిత్​ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఇకపై మహిళల రక్షణ కోసం పోలీస్‌శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ మేరకు తెలియజేసారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.