రమ్య హత్య కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెలువడి..

0
49

రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసుపై కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. ప్రేమపేరుతో రమ్యను శశికృష్ణ అనే అబ్బాయి వేధించగా..దానికి ఆ అమ్మాయి నిరాకరించడంతో శశికృష్ణ కక్షతో గత ఏడాది ఆగష్టు 15న అందరు చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరమ్య హత్య కేసు తీర్పు రానే వచ్చింది. 8 నెలల పాటు 28 మంది సాక్షులను న్యాయస్దానం విచారించిన తర్వాత న్యాయస్థానం తుదకు తీర్పు ఇచ్చింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఆ నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఈ కేసుపై న్యాయమూర్తి రాంగోపాల్ తుది తీర్పు వెలువరించి న్యాయం చేసాడు.