సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? నష్టపరిహారం ఇప్పిస్తుందా? లేక క్షమాపణ, మందలింపుతో వదిలేస్తుందా? చైతూతో డైవోర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైమ్ కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం కావాలంటోంది. ఇంతకీ, సమంతకు జరిగిన అన్యాయమేంటి? ఆమె ఎలాంటి న్యాయం కోరుకుంటోంది? సామ్ మనోవేదనకు కారణమేంటి. ఇది అందరికి ఇప్పుడు ఉన్న డౌట్.
పిటిషన్ ద్వారా సమంత తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది. విడాకుల ప్రకటన తర్వాత తనపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు. నన్ను, నా క్యారెక్టర్‌ని కించపర్చారు. విడాకుల కోసం 300 కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు. నా డ్రెస్సింగ్‌పై వీడియోలు పెట్టి కించపర్చారు అబార్షన్, అఫైర్స్ అంటూ తప్పుడు కథనాలు అల్లారంటూ తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది సమంత.
ఇంతకీ, సామ్ ఏం న్యాయం కోరుకుంటోంది? తన పరువును బజారుకీడ్చిన యూట్యూబ్ ఛానెల్స్‌తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలంటోంది. అలాగే, తనకు లేనిపోని ఎఫైర్లు అంటగట్టిన డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటోంది. ఆ యూట్యూబ్ ఛానెల్స్ నుంచి లింకులు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది. మరి, సమంత కోరుకున్న న్యాయం జరుగుతుందా..లేదో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో కొద్దిసేపట్లో తేలిపోనుంది.