అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావుతో సీన్ రీ కన్స్ట్రక్షన్

0
101

మహిళను బెదిరించి అత్యాచారం చేసిన కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా నేడు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వనస్థలిపురం పోలీసులు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, ఆక్సిడెంట్ కేసులపై ఏసీపీ పురుషోత్తం రెడ్డి విచారించారు. బాధితురాలు ఇంటి దగ్గర నుండి యాక్సిడెంట్ అయిన ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు నాగేశ్వర్‌రావును హయత్‌నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం జ్యూడీషియల్ రిమాండ్‌కు మాజీ సీఐను తరలించారు.