Flash News- పాఠశాలలో అగ్నిప్రమాదం..20 మంది చిన్నారులు మృతి

School fire kills 20 children

0
132

ఆఫ్రికా దేశం నైజర్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మారాడి నగరంలో ఓ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. అదే నగరంలో బంగారు గని కూలి 18 మంది మరణించారు. గడ్డితో నిర్మించిన పాఠశాలలోని మూడు తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.