ఏసీబీ వలలో ఎస్‌ఈ..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

0
81

ఏపీలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే పలువురు లంచగొండులను పట్టుకోగా..తాజాగా ఇవాళ కర్నూలు నగరపాలక సంస్థ ఎస్‌ఈని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. అతడి ఛాంబర్‌లో దొరికిన రూ. 15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌ చేపట్టిన రూ. 1.15 కోట్ల బిల్లుల మంజూరుకు ఎస్‌ఈ రూ. 15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు, కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఎస్‌ఈని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు.