నిరుద్యోగులకు శుభవార్త..7000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0
41

బ్యాంకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త..ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7000 క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మేరకు ఐబీపీఎస్ పూర్తి వివరాలను వెల్లడించింది. దీనికి సంబంధించి జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక విధానం ప్రిలిమ్స్​, మెయిన్స్ పరీక్షా ఫలితాల ఆధారంగా ఉండనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు.

అర్హత: ఏదైనా డిగ్రీ పట్టా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక భాషల్లో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్​ ఉండాలి. లేదా డిగ్రీలో ఏదైనా కంప్యూటర్​ సబ్జెక్ట్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2021 జులై 1 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయో పరిమితి 28 ఏళ్లు. రిజర్వేషన్​ కోటా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

వేతనం: ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టులకు ఎంపికైన వారికి ఇది రూ. 19,900- 47,920 వరకు వేతనం ఉంటుంది. డీఏ, హెచ్​ఆర్​ఏ, మెడికల్​, ట్రాన్స్​పోర్ట్​ సహా ఇతర అలవెన్సులు మినహాయించి .. అప్పుడే ఉద్యోగంలో చేరినవారికి రూ. 29,453 వేతనం చేతికి అందుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం : 01-07-2022

దరఖాస్తులకు చివరితేదీ : 21-07-2022

ప్రి ఎంట్రెన్స్​ టెస్ట్​ కాల్​లెటర్ ​: 2022 ఆగస్టు

ప్రి ఎంట్రెన్స్​ టెస్ట్​ : 2022 ఆగస్టు

ప్రిలిమ్స్​ కాల్​లెటర్​ డౌన్​లోడ్ ​: 2022 ఆగస్టు

ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ : 2022 సెప్టెంబర్​

ప్రిలిమ్స్​ ఫలితాలు : 2022 సెప్టెంబర్​/అక్టోబర్​

మెయిన్స్​ ఎగ్జామ్ ​ : 2022 అక్టోబర్​

తుది ఫలితాలు : 2023 ఏప్రిల్​

ప్రిలిమ్స్​ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్​లో 30, న్యూమరికల్​ అబిలిటీ 35, రీజనింగ్​ అబిలిటీ 35 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్షకు గంట సేపు ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి కటాఫ్​ను బట్టి మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. మెయిన్స్​లో మొత్తం 190 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. సమయం 160 నిమిషాలు ఉంటుంది. దీంట్లో కటాఫ్​ను బట్టి నేరుగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.