కేంద్రం సంచలన నిర్ణయం..ఆ టీవి ఛానల్ పై వేటు

0
97

తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న ఓ టివి ఛానల్ పై కేంద్రం వేటు వేసింది. విదేశాల నుంచి పని చేస్తున్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’ ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. దీనితో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన యాప్​లు, వెబ్​సైట్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’తో ఈ సంస్థకు దగ్గరి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.