పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎప్పుడంటే?

0
33

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను చిత్రబృందం పంచుకుంది.

భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా నిన్న జరగాల్సిన “భీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో.. “బీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ ను అధికారికంగా ప్రకటించి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కు శుభవార్త చెప్పింది భీమ్లా నాయక్‌ చిత్ర బృందం. భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా ప్రకటించింది. రేపు సాయంత్రం 6.30 గంటలకు భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించబోతున్నట్లు పోస్టర్‌ ద్వారా ప్రకటన చేసింది సితార ఎంటర్‌ టెన్‌మెంట్‌.