బస్సు, జీపు ఢీ ఏడుగురు మృతి..ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా..!

0
112

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా..అతివేగం ఈ ప్రమాదానికి దారి తీసిందని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.

క‌మ‌లాపుర‌లో వేగంగా వ‌చ్చిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు జీపును ఢీకొట్టడంతో బ‌స్సులో మంట‌లు ఒక్కసారిగా చెలరేగి ఏడుగురు ప్ర‌యాణికులు అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికీ వైద్యులు సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.