యాంకర్ కు లైంగిక వేధింపులు, ఆత్మహత్యాయత్నం, కాంగ్రెస్ నేత అరెస్టు

0
99

హైదరాబాద్ పాత బస్తీలో నహిదా ఖాద్రీ అనే యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ఓవైసి ఆసుపత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగే కంటే ముందు ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తనను డబీర్ పురా కాంగ్రెస్ నేత సలీం లైంగికంగా వేధిస్తున్నట్లు చెప్పి కన్నీరు కార్చింది. తనతో కలిసి ఉండాలంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆమె బాధపడుతూ వీడియోలో వివరించింది.

తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవమానంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వీడియోలో వివరించింది. ప్రస్తుతం ఆ యువతి ఒక యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా, న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జరిగిన ఘటనపై చాంద్రాయన గుట్ట పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. సలీం ను అరెస్టు చేశారు.

ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఔటాఫ్ డేంజర్ అని వైద్యులు మీడియాకు వెల్లడించారు.