Shraddha walker case: 100మంది సాక్ష్యుల వాంగ్మూలం అందులో పొందుపరిచిన పోలీసులు

-

Shraddha walker case: ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసుకి సంబంధించి పోలీసులు 3వేల పేజీలతో కూడిన ఛార్జిషీటును సిద్ధం చేశారు. 3 నెలలకు పైగా జరిపిన విచారణలో ముసాయిదా పత్రంలో 100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు పొందుపర్చినట్టు అధికారులు తెలిపారు. విచారణలో సేకరించిన కీలకమైన ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై కేసు ఆధారపడి ఉందని వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Shraddha walker case: అంతేకాకుండా దీనిలో అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించడం, నార్కో పరీక్ష ఫలితాలు, ఫోరెన్సిక్ పరీక్ష నివేదికలను కూడా పోలీసులు జత చేశారు. ఇది ప్రస్తుతం న్యాయ నిపుణుల సమీక్షలో ఉందని తెలిపారు. గత ఏడాది మే 18న అఫ్తాబ్ తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్‌ను దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అక్టోబర్‌లో శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టగా ఈ ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో శ్రద్ధా శరీరభాగాలను గుర్తించారు. వీటిని తండ్రి డీఎన్ఏతో పోల్చిచూడగా సరిపోలాయి. దీనిపై పలువురు సాక్ష్యులను విచారించిన అధికారులు ఛార్జిషీటు నమోదు చేశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...