పాత కేసులో గోకుదామనుకున్న జగిత్యాల ఎస్సై : అడ్డంగా బుక్కయ్యాడు

0
101

30వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒక ఎస్సై ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల టౌన్ ఎస్సై శివ కృష్ణ గురువారం నాడు 30వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ముగిసిపోయిన కేసులో బాధితులను మళ్లీ పిలిపించి బెదిరించారు సదరు ఎస్సై శివ కృష్ణ. తనకు 50వేలు ఇస్తే వదిలిపెడతానని లేదంటే మీ పని చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

డబ్బుల కోసం వేధింపులకు గురిచేయడంతో బాధితుడు రాజేష్ నేరుగా కరీంనగర్ ఎసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో రాజేష్ వద్ద నుంచి రూ.30వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు ఎస్సైని పట్టుకున్నారు. సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశారు.