తల్లి మరణం తట్టుకోలేక తనువు చాలించిన అన్నదమ్ములు

0
37

ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దవాళ్ళను చేసిన తల్లి అంటే అందరికి ఇష్టమే. తమ తల్లిని సంతోషంగా ఉంచాలని, కష్ట పెట్టకూడదని కోరుకుంటారు. అయితే అలాంటి అదృష్టం కొందరికే దొరుకుతుంది. నవమాసాలు మోసి పెంచిన తల్లికి దూరమై ఉండలేకపోయారు. తమ తల్లి ఇక లేదనే వార్త వారి గుండెల్ని పిండేసింది. తల్లి లేని జీవితం తమకు వద్దని ఇద్దరు అన్నదమ్ములు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదకర ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రాంపల్లి గ్రామానికి చెందిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి తల్లి ప్రమీల 9 నెలల క్రితం మరణించింది. ఇది తట్టుకోలేని ఇద్దరు కొడుకులు తమ తల్లి ఇక లేదనే వార్త హృదయాన్ని కలిచివేసింది. అనారోగ్యంతో అమ్మ మరణించడం తట్టుకోలేని కొడుకులు ప్రతిరోజూ విలపించారు. అమ్మను మర్చిపోయి ఉండలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్ద కొడుకు యాదిరెడ్డి ఉరేసుకోగా..మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరు రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది.

“అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు..లేనప్పుడు తెలిసిన ప్రయోజనం ఉండదు”