నారాయణ మెడికల్ కాలేజ్ లో విద్యార్థిని ఆత్మహత్య

0
83

ఏపీ: కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రతిభా కుసుమాలు రాలిపోతున్నాయి. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో PDS ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. హాస్టల్‌ రూమ్‌లో డెంటల్ విద్యార్ధిని లాలస ఉరేసుకుని కనిపించింది. ఇద గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునేలోపే ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే, లాలస మృతిపై పేరెంట్స్‌ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటే తెల్లవారేవరకు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంపై పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కావాలనే ఆలస్యంగా బయటపెట్టారని ఆరోపిస్తున్నారు.