ఫ్లాష్: ఏపీలో దారుణం..సర్‌ప్రైజ్‌ అంటు కాబోయే భర్త గొంతు కోసిన నీచురాలు..

0
86

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అని అందరు అంటుంటే..ఈ యువతీ మాత్రం కాబోయే భర్తనే నమ్మించి గొంతు కోసింది. అసలు ఏం జరిగిందంటే..అనకాపల్లి రవికమతంలో ఓ యువతీకి  పెళ్ళి ఇష్టం లేకపోవడంతో కాబోయే భర్త గొంతును నిర్దాక్షణీయంగా కోసింది. తన కోసం ఊహించని గిఫ్ట్ తెచ్చానని..కళ్ళు మూసుకుంటే చూపిస్తానని నమ్మించి యువకుడి గొంతు కోసింది.

దాంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి  తరలించి వైద్యుల సమక్షంలో చికిత్సను అందిస్తున్నారు. మే 28న వివాహం చేయాలనీ నిర్ణయం తీసుకోగా..ఇంతలోనే ఇలా జరగడం కుటుంబ సభ్యులను కలచివేస్తుంది. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.