Flash- విషాదం..ఐకేపీ కేంద్రంలో ప్రాణాలు విడిచిన రైతు

Survivor farmer at IKP Center

0
81

ధాన్యం కుప్పపైనే రైతు ప్రాణాలు విడిచిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంట ఐకేపీ కేంద్రానికి నెల రోజుల క్రితం రైతు ఐలేష్ ధాన్యం తీసుకొచ్చారు. నెల రోజులుగా ఐకేపీ కేంద్రంలోనే ఉంటున్నారు. ఇవాళ ఉన్నట్టుండి ఐలేష్ కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రైతు మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.