ప్రాణాల తీసిన విహార యాత్ర..గోదావరి నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

0
127

పరీక్షలలో మంచి మార్కులు రావాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17మంది విద్యార్థుల బృందం దైవదర్శనం కోసం విహార యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి దిగడంతో ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందడం జరిగింది. బాసరలో కిరణ్ అనే యువకుడు నీటిలో మునుగుతున్న ఘటనను గమనించిన ప్రతీక్ రక్షించడానికి ప్రయత్నిచే క్రమంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం జరిగింది.

ఇద్దరికి ఈత రాకపోవడంతో బాసరలో ఈ విషాదం చోటుచేసుకున్నట్టు వారి స్నేహితులు చెబుతున్నారు. వారు మునిగేటప్పుడు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు, విద్యార్థులు కాపాడడానికి ప్రయత్నించినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాలించి బయటకు తీసి పోస్టుమట్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.