హైదరాబాద్ హాస్పిటల్ లో ‘ఠాగూర్’ సీన్ రిపీట్..శవానికి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు..చివరకు..

0
90

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ‘ఠాగూర్’ సినిమా సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాలో హీరో చిరంజీవి ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోడానికి ఓ అబద్దం చెబుతాడు. చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి తన అన్నని కాపాడమంటూ..ఎంత ఖర్చు అయిన పెడతామని డాక్టర్లను వేడుకుంటాడు. డాక్టర్లు చిరంజీవిని అమాయకుడనుకొని.. చనిపోయిన మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు నటిస్తుంటారు. చివరకు మేం ఏంతో ట్రై చేశాం కానీ మీ అన్నయ్యని కాపాడలేకపోయామని దీనంగా చెబుతారు. అప్పుడు చిరంజీవి చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ చూపించి వీళ్ల గుట్టు రట్టు చేస్తాడు. అచ్చం ఇలాంటి సీనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రిపీట్ అయింది.

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆమెకు వైద్యం అందుతోందని.. కోలుకుంటోందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత తమ ప్రయత్నం ఫలించలేదని మృతి చెందిందని తెలిపారు. అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబానికి రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందపత్రం కూడా రాసిచ్చారు.